జోరుమీదున్న మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఇక మహేష్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే అహ్మదాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ దీపావళికి విడుదల చేస్తారని వార్తలొచ్చాయి కానీ ఇంకా సినిమా విడుదలకు చాలా టైం ఉంది కాబట్టి అప్పుడే ఫస్ట్‌లుక్ వద్దనుకున్నారు. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని డిసెంబర్‌లో విడుదల చేస్తారని తెలిసింది. ఇక ఫస్ట్ టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారట. మొత్తానికి మహేష్ సినిమా కోసం ఆయన అభిమానులతోపాటు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.