కోటీశ్వరుడు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృధ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేలో నిర్మిస్తున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షూటింగ్ పూర్తయింది. ఈనెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, ఈనెలలో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయిందని, వసంత్ చేసిన మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని అన్నారు. పృధ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖారామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, సినిమాటోగ్రఫి:బాల్‌రెడ్డి.పి, కథ, మాటలు:నాగేంద్రకుమార్ వేపూరి, పాటలు:రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, నిర్మాత:కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇ.సత్తిబాబు.