రంగస్థల కళాకారులతో పూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలిమి విజన్ పతాకంపై రంగస్థల కళాకారులతో పి.ఎం.సుందరరావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మహాత్మా జ్యోతిరావు పూలే’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. కాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. తెలుగులో తొలిసారిగా పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. సమాజంలోని అసమానతల్ని తొలగించి స్ర్తి విద్యా వ్యాప్తికై కృషిచేసిన మహనీయుడు పూలేపై రూపొందించిన ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 60 మంది రంగస్థల కళాకారులు నటించారని నిర్మాత పి.ఎం.సుందరరావు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణతోపాటు ప్రభుత్వ సహాయ సహకారాలు ఈ చిత్రానికి లభిస్తున్నాయని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల చివరివారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నామని ఆయన అన్నారు.