సామాన్యుడి చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’గా అనువదించారు. వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రూపొందించిన ఈ చిత్రానికి రవి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా వై.శేషిరెడ్డి మాట్లాడుతూ చట్ట సభల్లో కూర్చుని చట్టాలుచేసే రాజకీయ నాయకులు, ఆ చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారులు, పారిశ్రామికవేత్తలతో కలసి సామాన్యుల జీవితంతో ఏ విధంగా ఆడుకుంటున్నారు అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. సమాజంలో సాగుతున్న ఓ అసాంఘిక సమస్యను ఆధారంగా చేసుకుని, ఈ చిత్రం రూపొందించారని, చక్కని స్క్రీన్‌ప్లేతో ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా సాగుతుందని, చివర్లో ఓ మెసేజ్ కూడా ఉంటుందని అన్నారు. సముద్రఖని, రియాజ్ పోటీపడి నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లకు మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. శక్తివేల్‌వాసు, సముద్రఖని, వైశాలి, రియాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, కెమెరా: జోన్స్ ఆనంద్, సంగీతం: ఎఫ్.ఎస్.ఫైజల్, నిర్మాణం: వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్, దర్శకత్వం: రవి.