ఏ పాత్రలోనైనా జీవిస్తా.. సాయికుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను చేసిన ప్రతి సినిమాలోను ఏదో ఒక విషయాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తాను. నెగెటివ్ పాత్రని చేసినా ఆ పాత్రని ఒక దుర్యోధనుడిగా, రావణాసురుడిగా భావిస్తాను. విలన్ పాత్రలో నేనున్నప్పుడు ఛస్తే వీడి చేతిలో చావాలి, చంపితే వీడిలాంటి వాడిని చంపాలి, అని అనుకునేలా నటిస్తాను’ అని నటుడు సాయికుమార్ తెలిపారు. ఆర్.పి.పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాలో తాను కీలకమైన పాత్రలో నటించానని, మీడియాకు సంబంధించిన తన పాత్ర వైవిధ్యంతో కూడి ఉందని అన్నారు. నటుడిగా ఓ స్థాయి వచ్చిన తర్వాత తాను వచ్చిన ప్రతి పాత్రను సరికొత్తగా చేసే ప్రయత్నం చేశానని, అలా ప్రేక్షకులు కూడా తననుంచి ఎదురు చూస్తారని ఆయన అన్నారు. ప్రేక్షకుల ఎదురుచూపులకోసం తాను మనలో ఒకడు చిత్రంలో నటించానని, దర్శకుడు కథ చెప్పినప్పుడు రియలిస్టిక్‌గా వుందని భావించానని తెలిపారు. తనకు రెండు రకాల పిచ్చి ఉందని, ఒకటి క్రికెట్ అయితే మరొకటి ప్రతి ఛానల్‌ను చూడటమని తెలిపారు. ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమాలనుండి రాత్రి మిట్‌నైట్ మసాలా వరకు అన్ని రకాల ఛానల్లు చూస్తానని, ఇవాళ మీడియా సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసు కనుక అలాంటి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తప్పక చూడదగినదని ఆయన అన్నారు. తన నటనలో ఓవర్‌ఫ్లో చాలా అయినట్లు అనిపించేదని, అలా జరిగినప్పుడు ఎంతోమంది దర్శకులు తనను కంట్రోల్ చేశారని, చాలా ఆసక్తికరంగా సాగే ఈ సినిమాలో ఓ అందమైన మెసేజ్ కూడా ఉందని ఆయన వివరించారు.