బ్లాక్‌మనీ కష్టాలకు చెక్ -- ఆర్.నారాయణమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ఆర్.నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సందర్భంగాపాత్రికేయుల సమావేశంలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘దేశంలో ప్రజల సమస్యలకు కారణమైన నల్లధనానికి మూలమేంటి? ఓ సాధారణ హెడ్‌కానిస్టేబుల్ కుటుంబం నల్లధనంవల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది, ఎలా విచ్ఛిన్నమైంది, దానికి ఆ కానిస్టేబుల్ ఏంచేశాడనేదే ఈ సినిమా కథ. మానవీయ విలువలపై ఆర్థిక విలువలు ఎలాంటి ఆధిపత్యాన్ని కనపరుస్తున్నాయి. రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులనుండి ప్రజలను రక్షించేదెలా అనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ- బ్లాకమనీవల్ల దేశమెంతో వెనుకబడిపోతోంది, బ్లాక్‌మనీవల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయనే దాన్ని సినిమాలో చూపిస్తున్నామని, అలాగే బ్లాక్‌మనీ సమస్యను రూపుమాపి ఓ హెడ్ కానిస్టేబుల్ సమాజాన్ని ముందుకు ఎలా నడిపాడనేదే చూపిస్తున్నామని, 60 రోజులపాటు సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని, డిసెంబర్ 15లోపు చిత్రీకరణు పూర్తిచేసి జనవరిలో సినిమాను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ ‘మంచి మెసేజ్ వున్న సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆర్.నారాయణమూర్తి మా మనిషి. మా సంస్థలో జయసుధ చాలా సినిమాలు చేసింది. ఈమధ్యనే మేం ‘బిచ్చగాడు’ అనే సినిమా చేశాం. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సక్సెస్‌తో మా బాధ్యత మరింత పెరిగింది’ అని చెప్పారు.