11న సాహసం శ్వాసగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథాచిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో.’ ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘రెండు మూడు రోజుల్లో సినిమా సెన్సార్ జరుపుకోనుంది. ఆడియో సక్సెస్ చేసిన విధంగానే సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. నన్ను ఎప్పుడో ఏదో ఒక కొత్త స్టయిల్‌లో ప్రెజెంట్ చేస్తుంటారు. అందుకు గౌతమ్ మీనన్ గారికి స్పెషల్ థాంక్స్. ఏమాయ చేశావే సినిమాకు ఎక్స్‌టెన్షన్‌గా నా క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుంది. నవంబర్ 11న విడుదలకానుంది’ అన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఏమాయ చేశావే, ఘర్షణ సినిమాలు నాకెంతో ఇష్టమైనవి. ఈ రెండు సినిమాల కాంబినేషన్‌ను నెక్స్ట్ లెవల్‌లో సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఉంటుంది అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను ఒకటిన్నర సంవత్సరంపాటు చాలా ప్యాషన్‌తో తీశారు. ఏ మాయ చేశావే స్టయిల్‌లో ఫస్ట్ఫా క్యూట్‌గా, సెకండాఫ్ ఘర్షణ స్టయిల్‌లో ఎగ్జయిట్‌మెంట్‌తో కలగలిసిన సినిమా ఇది. సాంగ్స్ అన్నీ ఫస్ట్ఫాలోనే వస్తాయి. సెకండాఫ్‌లో చాలా థ్రిల్లింగ్‌గా సాగిపోతుంది. సినిమా నవంబర్ 11న రిలీజ్ అవుతుంది’ అన్నారు.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ‘సినిమా నవంబర్ 11న విడుదల అవుతుంది. నేను చేస్తున్న 18వ సినిమా. కారణాలు తెలియలేదు కానీ సినిమా ఆలస్యమైంది. చైతు పెర్‌ఫార్మెన్స్ అదిరిపోయింది. ఏమాయచేశావే నెక్స్ట్ లెవలవ్ మూవీ ఇది. ఏ మాయచేశావేలో అబ్బాయి ఈ సినిమాలో మగాడు అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడనేలా సినిమా లవ్, యాక్షన్, థ్రిల్లింగ్‌గా ఉంటుంది’ అన్నారు. మంజిమ మోహన్ మాట్లాడుతూ.. ‘రెహమాన్ మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.