నరుడాలాంటి సినిమాలు కత్తిమీద సామే - తనికెళ్ల భరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో సుమంత్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘నరుడా..! డోనరుడా..!’. ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్‌పై మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో తనికెళ్ల భరణి మాట్లాడారు. ‘హీరో సుమంత్‌తో సత్యం, గోదావరి సినిమాల నుండి మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో నరుడా డోనరుడా చిత్రంలో డా.ఆంజనేయులు అనే మంచి పాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. హీరో పాత్రకు సమానంగా వుండే పాత్రలో నటించాను. అరవై శాతం సినిమాలో నా పాత్ర కనబడుతుంది. హిందీలో విజయవంతమైన ‘విక్కిడోనర్’ సినిమాను తెలుగులో మన ఆడియెన్స్‌కు తగిన విధంగా రూపొందించడమంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా షూటింగ్ టైంలో టీం చేస్తున్న వర్క్ చూసి నాకు లేడీస్ టైలర్ సినిమా గుర్తుకు వచ్చింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ సినిమాగా భావించి పనిచేశారు. దర్శకుడు మల్లిక్‌రామ్ సినిమా స్క్రీన్‌ప్లేను చక్కగా రాసుకున్నాడు. హిందీలో అన్నుకపూర్ చేసిన పాత్రను తెలుగులో నేను వేశాను. హిందీలో అన్నుకపూర్ పాత్రకు నేషనల్ అవార్డు వచ్చింది. అటువంటి క్లిష్టమైన పాత్ర చేయడం అంటే సులువు కాదు. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. చివర్లో ఆర్ద్రత నిండి ఉంటుంది. రియాలిటీతో కూడిన మెసేజ్ ఉండే సినిమా’ అన్నారు. దర్శకుడు మల్లిక్‌రామ్ మాట్లాడుతూ, సినిమా పాటలకు, థియేట్రికల్ ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతోందని, ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడానికి కామెడీ అవసరం అనిపించి, అదే ప్రధానాంశంగా చెప్పడానికి ప్రయత్నం చేశామన్నారు. స్ఫెర్మ్ డొనేషన్‌పై చాలా సినిమాలు వచ్చాయికానీ విక్కీడోనర్ నాకు తెలసి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఉన్న సినిమా అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ, నరుడా డోనరుడా ఓ సెన్సివిటీ ఉన్న సబ్జెక్ట్. సినిమాను 60 రోజులపాటు షూట్ చేశామని, సినిమా బాగా వచ్చిందని, కెరీర్ పరంగా నాకు ఈ సినిమా హెల్ప్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అన్నారు.