ఘాటు ఎక్కువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్ హీరోగా ఎస్.కె.సత్య దర్శకత్వంలో క్లాప్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వరుణ్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య వివరాలు తెలియజేస్తూ- ‘పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా మొత్తం గుంటూరు నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్ మరో ముఖ్యపాత్రలో కన్పిస్తాడు’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, ‘ఇప్పటికే టాకీ పూర్తయింది. త్వరలోనే పాటల చిత్రీకరణతోపాటు మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేస్తామ’ని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:డి.జె.వసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, నిర్మాత: శ్రీవరుణ్ అట్లూరి, దర్శకత్వం: ఎస్.కె.సత్య.