రోజ్ గార్డెన్ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధా ఫిలిం డివిజన్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్‌శెట్టి జంటగా జి.రవికుమార్ దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు రవికుమార్ తెలియజేస్తూ, ‘కాశ్మీర్ అల్లకల్లోలంగా వున్న సమయంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సాహసంతో ఈ చిత్రాన్ని అక్కడే నిర్మిస్తున్నాడు. భారీ భద్రతమధ్య ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ పూర్తిచేశాం. ఈ సినిమాలో సైన్యానికి చెందిన నిజమైన ఆయుధాల్ని ఉపయోగించాం’ అన్నారు. సమర్పకుడు చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ, ‘ఇప్పటికే 15 రోజులుగా కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుతున్నాం. మరో 40 రోజులపాటు అక్కడే షూటింగ్ వుంటుంది. లవ్ అండ్ మ్యూజికల్ సినిమాగా తెరకెక్కే ఈ చిత్రం- ఓ ప్రేమజంట టెర్రరిస్టుల కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనే ఆసక్తికర పాయింట్‌తో ఎన్నో ట్విస్టులతో రూపొందిస్తున్నాం. సంగీతానికి ప్రాధాన్యత వున్న ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్‌ని ముంబయిలో నిర్వహించాం అన్నారు.