బాలీవుడ్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామరస్ హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా ఆకట్టుకుంటోంది చెన్నై బ్యూటీ శ్రుతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న ఈమె ప్రస్తుతం పవన్ సరసన కాటమరాయుడు చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కమల్ చేస్తున్న ‘శభాష్ నాయుడు’లో నటిస్తోంది. సౌత్‌లో ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా ఈమె తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన సక్సెస్ దక్కడం లేదు. దాంతో బాలీవుడ్‌పై దండయాత్రలు చేస్తూనే వుంది. తాజాగా శ్రుతికి క్రేజీ ఆఫర్ దక్కింది. అజార్ మూవీ నిర్మాత టోనీ డిసౌజా ఓ క్రేజీ చిత్రం తీయనున్నాడు. ‘బెహన్ హోగీ తేరీ’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో నటిస్తోందట. షాహిద్ ఫేం రాజ్‌కుమార్‌రావు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తను చేసుకోబోయే భార్యకోసం ఎప్పుడూ ఎదురుచూస్తుండే యువకుడి కథాంశంతో తెరకెక్కనుందట. ఇందులో శ్రుతి పాత్ర కీలకంగా వుంటుందని తెలిసింది. మరి ఈ సినిమాతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారుతుందో లేదో చూడాలి.