మెట్రోలో చైన్ స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఏ పేపర్ తిరగేసినా చైన్ స్నాచింగ్ వార్తలే కనబడతాయి. ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం రద్దీగా వుండే ప్రాంతాలలో చైన్ స్నాచర్లు దర్జాగా గొలుసులు లాక్కెళ్లిపోవడం వింటూనే వున్నాం. ఈ బర్నింగ్ టాపిక్‌పై రూపొందించిన చిత్రం ‘మెట్రో’. రియలిస్టిక్‌గా మన కళ్లముందే జరుగుతున్నట్టుగా చిత్రీకరించిన ఈ సినిమా చైన్ స్నాచింగ్ నేపథ్యంలోనే సాగుతుంది. తెలుగువారికి ఏ మాత్రం పరిచయం లేని నటీనటులతో ఈ సినిమా రూపొందించారని దర్శకుడు ఆనంద్ కృష్ణన్ తెలిపారు. ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రజనీ తాళ్లూరి ఈ సినిమా అందిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లు పేదల జీవితాల్లో ఎలా నిప్పులు పోస్తుందో ఈ సినిమాలో చూడవచ్చని, ఆద్యంతం భావోద్వేగాలను టచ్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుందని నిర్మాత తెలిపారు.