పాజిటివ్ విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా కథనమని, విన్నర్ అనే పేరు ఈ కథకు కరెక్టుగా సరిపోతుందని, తమన్ ఐదు పాటలు, ఒక బీట్ సాంగ్ అందరికీ నచ్చేలా అందించారని తెలిపారు. ఒక షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యిందని, నవంబర్ 3 నుండి 22 వరకు ఫారిన్‌లో మరో షెడ్యూల్ చేస్తామని, ఉక్రెయిన్‌లో పాటల్ని, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 24న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు అన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్‌రుషి, అలీ, వెనె్నల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:చోటా కె.నాయుడు, సంగీతం:తమన్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, కథ:వెలిగొండ శ్రీనివాస్, రచన:శ్రీ్ధర్ శీపాన, అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.