గౌతమ్ మీనన్ తమిళ పెళ్లిచూపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాదిలో విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోటిన్నర లోపే బడ్జెట్‌లో కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక చిన్న సినిమా ఊహకు కూడా అందని స్థాయిలో వసూళ్లు రాబట్టడం ‘పెళ్లిచూపులు’ సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. దీంతో తెలుగులో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ఆయా సినీ పరిశ్రమల నిర్మాతలు పోటీ పడ్డారు. తాజాగా ఈ సినిమా తమిళ వర్షన్ రీమేక్ హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రేమకథలను తెరకెక్కించడంలో క్లాసిక్ దర్శకుడన్న పేరు తెచ్చుకున్న గౌతమ్‌మీనన్, పెద్ద మొత్తానికే ఈ హక్కులు కొనుగోలు చేశారట. అయితే ఈ రీమేక్‌కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారా లేక తన ప్రొడక్షన్ హౌస్‌లో వేరే దర్శకుడితో నిర్మిస్తారా అన్నది తెలియాలి.