వశం చేసుకోగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుకా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ చల్లా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘వశం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటను తమ్మారెడ్డి భరద్వాజ, ట్రైలర్‌ను రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ చల్లా మాట్లాడుతూ, ఒక మనిషి ఎందరో యోగులను కలిసి అధునాతన సైన్స్‌ను నేర్చుకుని పంచభూతాలను నియంత్రించే శక్తి సంపాదిస్తే, ఇతరులను వశం చేసుకునే శక్తి సాధిస్తే, అంత శక్తిని ఒక మనిషి నియంత్రించగలడా అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. సైన్స్‌ను, సూపర్ నాచురల్ పవర్‌ను సంయుక్తంగా కథనంలో రాసుకుని ఈ చిత్రాన్ని తీశామని, పంచభూతాలను తన అధీనంలోకి తీసుకునే శక్తి వచ్చిన మనిషి ఆ తరువాత తనలోని మానత్వాన్ని కోల్మోతాడా? లేక సమాజానికి మంచి చేయడానికి ఉపయోగిస్తాడా అనే కథనంతో ఈ సినిమా సాగుతుందని అన్నారు. ఒక్క ఫ్రేమ్ కూడా అనవసరమైనది ఈ చిత్రంలో లేదని, ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వాసుదేవరావు, నందకిశోర్, చక్రవర్తుల దుర్గాకిషోర్ పాల్గొని విశేషాలను తెలిపారు.