భయపెట్టే కాళరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనారిక ప్రధానపాత్రలో లక్ష్మీ టాకీస్ సమర్పణలో సూర్యదేవ్ ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై రాజీవ్ దర్శకత్వంలో గుడి వంశీధర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘కాళరాత్రి’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, దెయ్యాలు కూడా రేప్ చేస్తాయా అన్న అంశాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాలలో విభిన్నమైన కానె్సప్టుతో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సోనారిక అందంతోపాటు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, నగేష్ నారదాసి మాటలు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. యువతకు కనువిప్పుకలిగేలా రూపొందించిన ఈ చిత్రాన్ని నవంబర్ 11న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. కాళరాత్రి భయంకరమైన నిశిరాత్రివేళ హోరున వానలో బయలుదేరిన ఓ అమ్మాయికి ఎదురైన పరిణామాలు ఏమిటి? దానికి ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా వున్నాయి అనే కథనంతో ఈ చిత్రం తొలి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుందని, తెలుగు ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలను మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.