అనసూయ ఐటెమ్ సాంగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెరకి కొత్త అందాన్ని తీసుకొచ్చిన ముద్దుగుమ్మ అనసూయ. మొట్టమొదట ఆమెకి పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’లో ఐటెమ్ పాట చేసే అవకాశమొచ్చింది. కానీ అప్పట్లో నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పాట ఎందుకు చేయలేదో కూడా ఆ తర్వాత కారణాలు చెప్పింది. ఆయితే తర్వాత్తర్వాత కూడా ఐటెమ్ పాటల కోసం ఆమెని పలు ఆఫర్లు వరించాయి. కానీ వాటిని ఒప్పుకోకుండా క్షణం, సోగ్గాడే చిన్నినాయన చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు ఆమెకి మంచి పేరునే తీసుకొచ్చాయి. దాంతో అనసూయ ఓ రేంజ్ హీరోయిన్‌గా మారిపోయింది. తన అందంతో ఆకట్టుకుంటూ బుల్లితెరని సైతం వేడెక్కిస్తున్న అనసూయ, ఇటీవల మరో ఐటెమ్ పాటలో ఆడిపాడటానికి ఒప్పుకొందట. ఈసారి ఆమె ఐటెమ్ చేస్తోంది మెగా హీరోతో. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విన్నర్’ సినిమాలో ఐటెం పాట కోసమే అనసూయని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆ పాట కోసం అనసూయకి పెద్దఎత్తున పారితోషికం ముట్టజెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సోగ్గాడే చిన్నినాయనా.. అంటూ పాటతో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన అనసూయ, విన్నర్‌లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.