ప్రేమమ్ డైరక్టర్‌తో ఎన్టీఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్టు వెంట హిట్ కొట్టేశాడు చందు మొండేటి. ‘కార్తికేయ’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో తొలి విజయం అందుకున్నాడు. ఆ వెంటనే అక్కినేని కాంపౌండ్‌లో వచ్చి పడ్డాడు. నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’ రీమేక్ తెరకెక్కించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఊపులో వున్న చందు మొత్తం 12 కథలు సిద్ధం చేసుకున్నాడట. ఒక్కొక్కటి ఏ హీరోకి సూటైతే ఆ హీరోకి చెబుతున్నాడట. ఇప్పటికే నాగార్జున, అఖిల్‌లో క్యూలో వున్నారు. ఈలోగానే తారక్‌ని పట్టేశాడు. చందు ఇటీవలే ఎన్టీఆర్‌కి ఓ కథ వినిపించాడు.
అది అతడికి బాగా నచ్చేసింది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఎవరికీ ఓకె చెప్పలేదు కాబట్టి చందుకే అవకాశం వుంటుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పూరి, త్రివిక్రమ్, వక్కంతం ఇంతమంది లైన్‌లో వున్నా తారక్ ఈసారి ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తూ చందుకే ఓటేసే ఛాన్సుందని అంటున్నారు.