అహ్మదాబాద్‌లో మహేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన కొత్త సినిమాను శరవేగంగా పూర్తిచేస్తోన్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా హైద్రాబాద్‌లో పలు యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో హోరెత్తించిన టీమ్ తాజాగా అహ్మదాబాద్ షెడ్యూల్‌కోసం సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌తోపాటు గుజరాత్‌లోని కథకు అవసరమైన పలు లొకేషన్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. నవంబర్ 1న మొదలుకానున్న ఈ షెడ్యూల్ నిరంతరాయంగా నెలరోజులపాటు జరగనుందని తెలుస్తోంది. ఇండియన్ సినిమాలో కమర్షియల్ దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని భావిస్తోన్న టీమ్, ఇప్పటికే అన్ని భాషలకూ ఒకే టైటిల్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సోషల్ డ్రామాలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.