శాతకర్ణి బిజనెస్ సూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పట్నుంచే ప్రీరిలీజ్ బిజినెస్ పెద్దఎత్తున జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రాంతాలన్నింటికీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడైపోయాయి.
నైజాం, సీడెడ్, ఓవర్సీస్ లాంటి ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయాయి. ఇక శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ కూడా ఇప్పటికే అమ్ముడవడం విశేషంగా చెప్పుకోవాలి. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమాను క్రిష్ భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ గౌతమి పుత్ర శాతకర్ణికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.. నైజాం ప్రాంత హక్కులను హీరో నితిన్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఇక గుంటూరు, సీడెన్, కృష్ణ, నెల్లూరు హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ హక్కులను 8 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. మొత్తానికి బాలయ్య కెరీర్‌లో శాతకర్ణి పెద్ద సంచలనం రేపడం ఖాయం.