బోయపాటితో బెల్లంకొండ శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అల్లుడుశీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధవౌతున్నాడు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ నామ రూపొందించనున్న ఈ చిత్రం వచ్చేనెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. స్టయిలిష్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బెల్లంకొండ శ్రీనివాస్‌తు టైలర్‌మేడ్ కథతో ఈ చిత్రం రూపొందుతుందని, లవ్ యాక్షన్ అంశాలు సమానమైన స్థాయిలో ఈ చిత్రంలో ఉంటాయని, ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం రోజునుండి శరవేగంగా జరుపుతామని, దేవిశ్రీప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారని, మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: బోయపాటి శ్రీను.