అబ్బే.. అలాంటిదేం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పవన్ సరసన ‘కాటమరాయుడు’, కమల్‌హాసన్ రూపొందిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూ అక్కడ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే అక్కడ ఎన్ని సినిమాలు చేసినా పాపం ఈ భామకు కెరీర్ బెస్ట్ సినిమా మాత్రం దక్కడంలేదు. ఇక ఈమధ్య శ్రుతి, బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తోందంటూ జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి జోరుగా షికార్లు చేస్తున్నారని, ఇద్దరి వ్యవహారం బాగా ముదిరిపోయిందని అంటున్నారు? ఈ వార్తలపై శ్రుతిహాసన్ స్పందించింది.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రణబీర్ తనకు మంచి ఫ్రెండ్ అని.. ఇలాంటి హాస్యాస్పద వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడంలేదని, ఇలాంటివి విన్నప్పుడు ఫన్నీగా అనిపిస్తుందని తెలిపింది.