వాహ్.. బాహుబలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరడుగుల ఎత్తు, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, అందుకు తగ్గ వాయిస్, ఇవన్నీ కలిపి టాలీవుడ్ హీరో ఎలా వుండాలో అలా వుండే నటుడు- ప్రభాస్. వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా ఇమేజ్ సాధించాడు. హీ మాన్‌గా తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే ప్రభాస్ విజయం వెనుక ఎంతో పట్టుదల వుంది. వేసిన ప్రతి అడుగులోనూ దీక్ష వుంది. ‘బాహుబలికి ముందు ప్రభాస్, బాహుబలి తరువాత ప్రభాస్’ అని మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. బాహుబలిగా ప్రభాస్ స్థానంలో ఇంకెవరినీ ఊహించలేమంటూ అభిమానులు పొగిడారు. ఇది కూడా రికార్డుల రూపంలో రుజువైంది. తెలుగు సినిమా అంటే ఏవో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ డైలాగులు అన్న మాటను తీసివేసి విజువల్ వండర్‌గా రూపొందించిన బాహుబలి కోసం ప్రభాస్ రెండేళ్లు శ్రమించాడని అభిమానులు చెప్తారు. నిజమైన కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు చేస్తూ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు. చైనాలో ఇటీవలే 5వేల థియేటర్లలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు ప్రతిమను ప్రతిష్ఠించేలా చేసింది. ప్రపంచ కళాకారుల సరసన చోటు సాధించిన ప్రభాస్, గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో అత్యధికులు వెదికిన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. త్వరలో బహుబలి-2 (ది కన్‌క్లూజన్) చిత్రంతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందరినీ డార్లింగ్ అని ఆప్యాయంగా పలకరించే ఆయనకు సినీ అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

శనివారం విడుదలైన బహుబలి-2 (ది కన్‌క్లూజన్) ఫస్ట్‌లుక్