రియలిస్టిక్ గోలీసోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీపన్, అంజలి హీరో,హీరోయిన్లుగా ఎ.ఆర్.మురగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కిన్‌స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురగదాస్ నిర్మించిన చిత్రం ‘వత్తికుచ్చి’. తమిళ్‌లో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గోలీసోడా’ గా అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘మురగదాస్ శిష్యుడు కిన్‌స్లిన్ దర్శకత్వంలో మురగదాస్ సోదరుడు దిలీపన్‌ని హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో నిర్మించిన ‘వత్తికుచ్చి’ చిత్రం సెనే్సషనల్ హిట్ అయింది. దిలీపన్ అద్భుతంగా నటించాడు. అంజలి డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఎక్స్‌లెంట్ పెర్‌ఫార్మ్ ప్రదర్శించింది. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన సంగీతం సూపర్‌హిట్ అయింది. యూత్, లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని నేచురాలిటీకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. దిలీపన్, అంజలి జంటగా నటించిన ఈ చిత్రంలో సంపత్, జయప్రకాష్, జగన్, సతీష్, అఖిల్‌కుమార్, శరణ్య పొన్‌వన్నన్, రాజశ్రీ, అంగనారాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:జిబ్రాన్, కెమెరా:ఆర్.బి.గురుదేవ్, ఎడిటింగ్:ప్రవీణ్ కె.ఎల్., ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత:వెంకట్రావ్ మార్టోరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పి.కిన్‌స్లిన్.