భారీ ఆఫర్లతో ‘బెలూన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై, అంజలి కాంబినేషన్‌లో వచ్చిన ‘జర్నీ’ సూపర్ హిట్ అయింది. అదే కాంబినేషన్‌లో ఇప్పుడు ‘బెలూన్’ అనే చిత్ర నిర్మాణం అవుతోంది. 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై టి.ఎ.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ నిర్మిస్తున్న ‘బెలూన్’ చిత్రం ద్వారా ఎస్.శినీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మర్యాద రామన్న’ ఫేం నాగినీడు ప్రధాన విలన్‌గా నటిస్తుండగా యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు ఎస్.శినీష్ మాట్లాడుతూ, కొడైకెనాల్‌లో మూడో షెడ్యూల్ చేసామని ఈ షెడ్యూల్‌లో ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించడంతో 80 శాతం చిత్రం పూర్తయ్యిందని, రెండో షెడ్యూల్‌లో 50 లక్షల వ్యయంతో చెన్నైలో నిర్మించిన సెట్‌లో తీసిన సీన్స్ చిత్రానికి హైలెట్ అవుతాయని తెలిపారు. నాగినీడు నటన ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుంది. బెలూన్ మంచి సినిమా అవుతుందని నిర్మాతలు అన్నారు. జై, అంజలి, జనని అయ్యర్ ముఖ్యపాత్రలు పొషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి:ఆర్.శరవణన్, సంగీతం:యువన్ శంకర్‌రాజా, నిర్మాతలు:టి.ఎన్.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్, దర్శకత్వం:ఎస్.శినీష్.