వచ్చే నెలలో చిలుకూరి బాలాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ‘చిలుకూరి బాలాజీ’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. యువతరానికి వీసాల బాలాజీగా తన ఆశీర్వాదాలు అందిస్తూ తరతరాలుగా అందరిచే ఆరాధింపబడుతున్న చిలుకూరి బాలాజీ ప్రాశస్త్యతను, ఈ ఆలయ స్థల పురాణాన్ని ఒక దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. ఇది ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన అవసరం వుంది అని దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘సెన్సార్ అధికారుల ప్రశంసలతో మాకు చాలా ధైర్యం వచ్చింది. ఒక మంచి సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. ఈ సినిమాను జిల్లాలవారీగా ప్రదర్శన హక్కులను అడుగుతున్నారు. చినజీయర్ స్వామి విడుదలచేసిన ఈ చిత్రం ఆడియోను సోషల్ మీడియా ద్వారా తదితర మాధ్యమాల ద్వారా లక్షలాదిమంది ఈ సంగీతాన్ని వింటున్నారు. ఈమధ్యకాలంలో వచ్చిన భక్తి సినిమా పాటల్లో ఇవే గొప్పగా వినపడుతున్న పాటలని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్ మంచి సంగీతాన్ని అందించారు. సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, కాపర్తి వీరేందర్, రాణిపులోమజాదేవిలు భక్తిరసం జాలువారే విధంగా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. పాటలు విన్నవారంతా ఒక భక్తి తన్మయత్వంలోకి వెళ్ళవలసిందే అని అంటున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను నవంబర్ రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సాయికుమార్, సుమన్, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, భానుశ్రీమెహతా తదితరులు నటించారు.