దర్శకుల వెంట పడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస సినిమాలతో జోరుమీదున్నాడు నారా రోహిత్. తనకు నచ్చిన కానె్సప్టులను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘శంకర’. తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో శ్రీ లీలా మూవీస్ పతాకంపై చంద్రవౌళి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా నారా రోహిత్ చెప్పిన విశేషాలు...

యూనివర్సల్ కంటెంట్
‘శంకర’ హీరో సెంట్రిక్ మూవీ. యూనివర్సల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇదే కానె్సప్టుతో బాలీవుడ్‌లో అకీరా సినిమా కూడా వచ్చింది. ఒక కాలేజీ అబ్బాయి తనకు సంబంధంలేని ఇష్యూలో ఇరుక్కుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. స్టూడెంట్‌కీ పోలీసులకీ మధ్య వార్ జరుగుతుంది.
ఆలస్యమైనా ఫర్వాలేదు
తమిళంలో ఈ సినిమా 2011లో వచ్చింది. బాలీవుడ్‌లో ఈమధ్యే విడుదల చేశారు. యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కడా తగ్గే అవకాశం వుండదు. ఇక నా విషయంలో ఈ సినిమా ఆలస్యం అవ్వడంవల్ల పెద్దగా నష్టపోయిందేమీ లేదు.
కాలేజీ స్టూడెంట్‌గా..
నేను మొదటిసారి కాలేజీ స్టూడెంట్‌గా నటించిన సినిమా ఇది. కాలేజీ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే రెజీనా కూడా తన పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించింది.
వరుస సినిమాలు
నేనెప్పుడూ స్టార్ దర్శకులతో పనిచేయాలని ఆశపడను. పైగా నాతో సినిమా చేయండని వారిని అడగడం ఇష్టముండదు. నాకు నచ్చిన కథ, నాదగ్గరకు వచ్చిన కథతో సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. నేను వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఇది నాకు నచ్చింది కాబట్టి అలుపు లేకుండా చేస్తూనే వుంటాను. ఏ సినిమా అయినా హిట్‌కోసమే చేస్తాం కదా!
తదుపరి చిత్రాలు
అన్నిరకాల జోనర్‌లో సినిమాలు చేయాలని వుంది. ఇక ప్రస్తుతం ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘కథలో రాజకుమారి’ చిత్రాలతోపాటు బెక్కం వేణుగోపాల్‌తో ఓ సినిమా, దాంతోపాటు మరో రెండు కమర్షియల్ సినిమాలు వున్నాయి.

-శ్రీ