విశాల్‌తో జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా స్టార్ హీరోల సినిమాలతో ఛాన్సులు కొట్టేస్తూ.. మరోవైపు సూపర్ హిట్స్‌ని అందుకుంటూ దూసుకుపోతున్న గ్లామర్ భామ సమంత జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉన్న సమంత అటు తమిళంలో కూడా అదే స్ట్రాటజీని మెయిన్‌టైన్ చేస్తోంది. లేటెస్ట్‌గా విశాల్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్‌కొట్టేసింది. తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథాచిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్‌పై ఉంచిన ఆయన, తాజాగా మరో కొత్త సినిమాను కూడా ప్రకటించేశారు. ‘ఇరుంబుతిరై’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్‌గా నటించనున్నారు. అదే విధంగా హీరో ఆర్య విలన్‌గా నటించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. మిత్రన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. విశాల్ తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇక కత్తిసంధై, తుప్పరివాలన్, పందెం కోడి 2, ఇరుంబు తిరై... ఇలా వరుస సినిమాలతో హీరోగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళుతున్నారు విశాల్. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.