డర్టీగేమ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయ్యూం, అస్మిత జంటగా తాడి మనోహర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన డర్టీగేమ్ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు సాగర్ సీడీని ఆవిష్కరించారు.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ- ‘దర్శకుడు మనోహర్ అద్భుతంగా తెరకెక్కించిన చిత్రమిది. తప్పకుండా ఈ పాటలు అందరికీ నచ్చుతాయి అన్నారు. దర్శక,నిర్మాత మనోహర్‌కుమార్ మాట్లాడుతూ- ‘అందరి సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న సమయంలో తెరకెక్కించాను. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ఇది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేస్తాం. సునీల్ కశ్యప్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. కార్యక్రమంలో ప్రసన్నకుమార్, కవిత, కోట శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.