భారీ రేటుకు బాహుబలి హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి-2 (ది కంక్లూజన్) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ ఫిలింస్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. భారీ పోటీ మధ్య 50 కోట్ల రూపాయలకు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఏషియన్ ఫిలింస్ ప్రతినిధులు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్‌లు మాట్లాడుతూ- ‘గతంలో మా సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలంగాణాలో పంపిణీ చేశాం. బాహుబలి చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా గట్టి పోటీ ఏర్పడింది. బాహుబలి-2పై అంచనాలు కూడా ఆ స్థాయిలో పెరిగాయి. తప్పకుండా ఇది ఘనవిజయం సాధిస్తుంది’ అన్నారు.