సెన్సార్ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ అందానికి ఫిదా అవని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. తనదైన అందం, నటనతో హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కి వెళ్లింది. ఆ తరువాత పెళ్లిచేసుకొని సినిమాలకు దూరమైన ఐష్ తాజాగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇటీవల చేసిన రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కాకుండా ప్రధాన పాత్రలు రావడంతో లాభం లేదనుకుందో ఏమో, వెంటనే గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఆమె రణబీర్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ముఖ్యంగా అందాలు ఆరబోయడమే కాకుండా రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన ట్రైలర్స్ ఇటీవలే విడుదలై సంచలనం రేపాయి. ఈ సినిమాతో మళ్లీ ఐష్ తన క్రేజ్ పెంచుకునేందుకు చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. దానికి కారణం ఈ సినిమాలో ఐష్ ఘాటుఘాటుగా చేసిన రొమాంటిక్ సన్నివేశాల్ని చాలావరకు సెన్సార్‌వాళ్ళు తొలగించారట. దాంతో ఈ సినిమాపై ఐష్ పెట్టుకున్న ఆశలన్నీ నిరాశలయ్యాయి.