ఇన్నాళ్లకు నటిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సుందరాంగి సోనమ్‌కపూర్ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఆమెకు ఎటువంటి ఉపయోగాన్ని ఇవ్వలేకపోయాయి. ఆమెతో నటించిన వారందరికీ సినిమాల్లో పేరు వచ్చినా, ఆమె మాత్రం కేవలం గ్లామర్‌ను నమ్ముకునే ఇన్నాళ్లు కెరీర్‌ను నెట్టుకుంటూ వచ్చింది. గత సంవత్సరం విడుదలైన ‘నీర్జా’ సినిమాలో మాత్రమే ఆమె నటించగలదు అని ఓ నమ్మకం ఏర్పడింది బాలీవుడ్ సినీ విమర్శకులకు. ఈ సినిమానుండే ఆమె నటించడం నేర్చుకుందని కూడా విమర్శలు వినిపించాయి. నటన రాని నటిగా బాలీవుడ్‌లో ఆమెపై ముద్రపడిపోయింది. ధనుష్‌తో చేసిన ‘రాన్‌ఝానా’ చిత్రం ఆమెకు ఓ రకంగా ప్లస్సే అయింది. ఆ వంకతో దక్షిణాదివైపు చూడడానికి ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్‌కన్నా దక్షిణాదిలోనే నటించే సత్తా వున్నవారికే అవకాశాలు వస్తాయని సోనమ్‌కపూర్‌కి తెలియదు. దక్షిణాదిని నమ్ముకుంటే అటు కెరీర్ పరంగా, ఇటు పారితోషిక పరంగా కూడా బాగా వుంటుందని ఆలోచిస్తోంది. త్వరలో దక్షిణాది చిత్రాల్లో ఎంట్రీ ఇవ్వనున్నదన్న విషయం మాత్రం పక్కాగా రూఢీ అయింది. ఇక ఎవరితో జతకడుతుందనేది మాత్రం త్వరలో తెలియనుంది.