ఆస్ట్రేలియాలో టీమ్ 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడిగా సైలెంట్ అండ్ రెడ్ కార్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియాస్ రూపొందిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ఆస్ట్రేలియాలో పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ, కథనాలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని, పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన శ్రీశాంత్, నటనలోనూ, డాన్సుల్లోనూ చలాకీతనం, పట్టుదలతో కన్పిస్తారని, స్టైలిష్‌గా వుంటారని తెలిపారు. తన డైలాగ్స్, డాన్సులు, ఫైట్లు, గెటప్స్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారని, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. అభిమానులంతా శ్రీశాంత్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఇందులో పాత్ర వుంటుందని, టీమ్ 5 అనే టైటిల్‌కు తగిన విధంగా కథ, కథనాలు ఉంటాయని దర్శకుడు సురేష్ గోవింద్ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని ఆయన అన్నారు.