నిర్మాతగా త్రివిక్రమ్ తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతగా మారాడు. ఆయన నేతృత్వంలో త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. పవన్, ప్రియస్వీటి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ- ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటితరం ఎలా వుంటుంది అనే అంశం వుంటుందని, ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ అమ్మాయి చేయి వదిలిపెట్టకూడదనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నామని, యువత ప్రేమను ప్రపోజ్ చేయడం అయిపోతే శారీరకంగా దగ్గరవ్వడం, లేకుంటే బార్‌కు వెళ్లడం లాంటి పరిస్ధితి మారాలి అనే అంశం ఈ చిత్రంలో వుంటుందని తెలిపారు. ఈనెల 15 నుండి ఏకధాటిగా షూటింగ్ చేసి మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తిచేస్తామన్నారు. మంచి కథతో యువతరం తెలుసుకోవాల్సిన అంశాలను ఈ సినిమాలో పొందుపరుస్తున్నామని, మ మేసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ భావం ఒక్కటే అనే మూలకథ వుంటుందని, రెండు షెడ్యూల్స్‌లో టాకీపార్ట్, ఒక షెడ్యూల్‌లో పాటలు పూర్తిచేస్తామని నిర్మాత త్రివిక్రమ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పురుషోత్తం, సంగీతం:వి.ఎస్.ఎన్, మాటలు: నాగబాబు, నిర్మాత:ఎస్.త్రివిక్రమ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాజేష్ యడమ.