విజయదశమితో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధృవ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు, ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని తెలిసింది. ‘నాన్నకు ప్రేమతో’ తరువాత సుకుమార్ రూపొందించే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని, పల్లెటూరు నేపథ్యంలో సాగే వైవిధ్యభరితమైన ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుందని, ఇందులో చరణ్ సరికొత్తగా కనిపిస్తాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.