పగ తీర్చుకునే పాము కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై విజువల్ వండర్స్‌ను క్రియేట్ చేయడంలో ఆయన శైలే వేరు. ‘అమ్మోరు’, ‘అంజి’, ‘దేవి’, ‘అరుంధతి’ వంటి అద్భుత చిత్రాల్ని రూపొందించి, తాజాగా అదే తరహాలో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాగాభరణం’. వంద చిత్రాలకుపైగా దర్శకత్వం వహించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కోడి రామకృష్ణ. పెన్ మూవీస్, ఇన్‌బాక్స్ పిక్చర్స్, బ్లాక్‌బస్టర్ స్టూడియో పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కోడి రామకృష్ణతో ఇంటర్వ్యూ...
* నాగభరణం గురించి?
- ఇది ఒక పాము కథ. ఓ పాముకు గత జన్మలోని విరోధాన్ని ఈ జన్మలో ఎలా తీర్చుకుందనేదే కథ. చివరిలో ఓ రాక్షసుడి కారణంగా పాము ఓడిపోతుంది. ఆ సమయంలో ఈశ్వరుడు ఓ శక్తిరూపంలో పాముకు సహాయం చేయడానికి వస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే అసలు కథ.
* సినిమా కోసం టెన్షన్ పడ్డారా?
- సాధారణంగా నా సినిమా అంటే ఒక అంచనా వుంటుంది. కానీ నాగాభరణం సినిమాకు మాత్రం ఆ అంచనాలు దాటిపోయాయి. దానివల్ల టెన్షనే ఎక్కువైంది.
* ఇలాంటి సినిమాలకు మంచి నిర్మాత అవసరం కదా?
- నిజమే. ఈ తరహా సినిమాలు రావాలంటే నిర్మాతలో ఆ తపన వుండాలి. ఇక నాగాభరణం సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాత సాజిదే కారణం. ఎంతో హార్డ్‌వర్కర్ తను. ఈ కథ విన్నప్పుడు ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను తీస్తాను, ఈ సినిమాతో నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి అని ఇంత రిస్క్ చేశాడు.
* విష్ణువర్థన్‌ని తెరపైకి తేవడం ఎందుకు?
- నేను తీసిన ‘్భరత్ బంద్’ సినిమా చూసి విష్ణువర్థన్ సినిమా బాగా చేశారని అభినందించారు. అప్పటినుంచి మధ్య పరిచయం ఏర్పడింది. ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. కథ కూడా వినిపించాను. అంతా ఓకే అయింది. నేను కథ రెడీ చేసుకుని వెళ్ళేలోపు ఆయన చనిపోయారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు క్లైమాక్స్‌లో శివుడు సృష్టించే శక్తిలో విష్ణువర్థన్‌ని ఎందుకు తీసుకురావద్దని సాజిద్ అడిగాడు. చనిపోయిన వ్యక్తిని ఎలా తెరపైకి తేగలమని అన్నాను. వెంటనే తను మకుట గ్రాఫిక్స్ వారితో మాట్లాడి విష్ణువర్థన్ పాత్ర క్రియేట్ చేయించాడు. అది చూసి షాకై తప్పకుండా ఆయన్ను క్లైమాక్స్‌లో పెడదామని ప్లాన్ చేశాం. చనిపోయిన వ్యక్తిని తిరిగి సినిమాలో చూపించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
* టెక్నాలజీని ఫాలో అవుతుంటారా?
- నేను ప్రతి సినిమాను చూస్తుంటాను. టెక్నికల్ ఏదైనా కొత్తగా వచ్చిందంటే దాన్ని గమనిస్తాను. ముఖ్యంగా ఆ టెక్నాలజీని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాను. అమ్మోరు సినిమాలో మొదటిసారి గ్రాఫిక్స్ వాడినపుడు అందరూ థ్రిల్ ఫీలయ్యారు. గ్రాఫిక్స్ ఏదో కావాలని అని కాకుండా కథకు అవసరమైనంతవరకే వాడితే దాని ఫలితం వేరేగా వుంటుంది. ఆ తరువాత దేవి, దేవుళ్లు సినిమాకు చేశాను. ముఖ్యంగా అంజి సినిమాకు వాడిన గ్రాఫిక్స్ భారీవే అని చెప్పొచ్చు. ముఖ్యంగా చిరంజీవిలాంటి ఇమేజ్ వున్న వ్యక్తితో అంత టైం తీసుకుని ఆ సినిమా చేశాము. దానికి ఆయన ఎంతో సపోర్టు అందించారు. ఆ తరువాత అరుంధతి గురించి మీకు తెలిసిందే.
* సినిమా ప్రోగ్రెస్ ?
- ఇప్పటికే షూటింగ్‌తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 14న దాదాపు 600 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను ఇంత భారీగా తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత శివకుమార్‌కు ధన్యవాదాలు. కన్నడలో రూపొందించిన సినిమా తెలుగులో ఇంత భారీగా విడుదలవడం ఇదే మొదటిసారి.
* ఇనే్నళ్ళ కెరియర్‌ను చూసుకుంటే ఏమనిపిస్తుంది?
- చాలా ఆనందంగా వుంది. నేను దర్శకుడిగా మారి 37 ఏళ్ళు అయింది. అయినా ఇంకా నేను సినిమాలు చేస్తున్నానంటే కారణం, ట్రెండ్‌ను ఫాలో అవడమే. నేను చేసిన ప్రతి సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేస్తాను. ముఖ్యంగా నిర్మాత సేఫ్ అయ్యాడా లేదా అనేదే చూస్తాను. నా మొదటి సినిమా నిన్ననే చేసినట్టుంటుంది. ముఖ్యంగా నేను ఇన్ని సినిమాలు చేశానంటే దానికి కారణం నా నిర్మాతలే. వారిచ్చిన సపోర్టే నన్ను ముందుకు నడిపిస్తుంది.
* తదుపరి చిత్రాలు
- ప్రస్తుతం ‘సత్యసాయిబాబా’ సినిమా ఒకటి జరుగుతోంది. అది 40 శాతంపైగా షూటింగ్ పూర్తయింది. మనిషి దేవుడు ఎలా అయ్యాడనే కథతో ఈ చిత్రం వుంటుంది. దాంతోపాటు అర్జున్ హీరోగా ఓ సినిమా అనుకుంటున్నాం. దానికి శ్రీలంక ప్రభుత్వం అనుమతి కావాలి. దాంతోపాటు బాలకృష్ణతో కూడా ఓ ప్రాజెక్టు లైన్‌లో వుంది.

- శ్రీ