బేతాళుడు వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా ప్రదీప్‌కుమార్ దర్శకత్వంలో మానసరిషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం బేతాళుడు. తమిళంలో ‘సైతాన్’ పేరుతో కూడా నిర్మిస్తున్నారు. బిచ్చగాడు చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ- నటుడిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా వున్న తనకు ఈ చిత్రం మరో మెట్టు అని తెలిపారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించానని, అరుంధతి నాయర్ కథానాయికగా నటించారని తెలిపారు. బిచ్చగాడు స్థాయిలోనే ఈ చిత్రం వుంటుందని, నటుడిగా తనను ఉన్నత స్థాయికి ఈ సినిమా తీసుకెళుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ప్రదీప్ కలిపురయత్, ఎడిటింగ్:వీరసెంథిల్, సంగీతం:విజయ్ ఆంటోని, సమర్పణ:ఎం.శివకుమారి, దర్శకత్వం:ప్రదీప్‌కుమార్.