మాటల్లో చెప్పలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమమ్ చిత్రం విడుదలయ్యాక ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, సంతోషంగా వున్నపుడు కేకలేసినా, నవ్వినా, ఏడ్చినా, గెంతినా అదంతా ఆనందంతోనేనని, అలాంటి అన్నిరకాల భావోద్వేగాలతో నేను ఇప్పుడు ఉన్నాను’ అంటూ సమంత తన ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది. తాజాగా అక్కినేని నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షో ముగిశాక అన్ని ప్రసార మాధ్యమాల్లో సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో తన ఆనందానికి అవధి లేకుండా పోయిందని చెబుతోంది సమంత. తనకు కాబోయే భర్త నటించిన చిత్రం తప్పక హిట్ అవుతుందన్న విషయం తనకు తెలుసని, ఈ విషయం తన ట్విట్టర్‌లో ముందే చెప్పానని, అది ఇప్పుడు నిజమవడం చాలా ఆనందాన్నిస్తోందని అంటోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు. మరి ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు అందులో ఒక్క పాత్రయినా సమంతను వరించి వుంటే బాగుండేదని అభిమానులు అడుగుతున్నారు. ఇందుకు నాగచైతన్య కూడా ఒప్పుకుంటూ తమ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ మంచి లవ్ స్టోరీ చేస్తాము అని ట్వీట్ ఇచ్చాడు. త్వరలో అలాంటి చిత్రం సెట్స్‌పైకి వెళుతుందో ఏమో చూడాలి!