అపార్ట్‌మెంట్‌లో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ క్రియేటివ్స్ ఫిలింస్ పతాకంపై నిఖిత, సంజన, ఉత్తేజ్, చిన్నా ప్రధాన తారాగణంగా శివగంగరాజు ఉడుమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోందని దర్శకుడు తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ఒక అపార్ట్‌మెంట్ సంస్కృతిలోకి వచ్చిన అమ్మాయి అక్కడ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది, చివరికి ఏం జరిగింది అన్న కథనంతో ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని తెలిపారు. సంగీత దర్శకుడు ఖుద్దూస్ అందించిన సంగీతం హిట్ అయిందని, నిఖిత, సంజనల నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. రక్ష, విజయ్‌సాయి, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సాబూజేమ్స్, సంగీతం:ఖుద్దూస్.ఎస్.ఎ., ఎడిటింగ్:నాగిరెడ్డి, నిర్మాత:శ్రీకాంత్ అంగళ్ళ, కథ, దర్శకత్వం:శివగంగరాజు ఉడిమూడి.