ఎత్తుపల్లాలు చూసేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్.. ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలు కూడా చేస్తూ నిరూపించుకుంటున్నాడు. లేటెస్టుగా ‘నేను శైలజ’తో మంచి హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు ‘హైపర్’గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. ‘కందిరీగ’, ‘రభస’ సినిమాలు రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ...

* మిమ్మల్ని చూసే టైటిల్ పెట్టినట్టున్నారు?
- ‘హైపర్’ అనే టైటిల్‌ను ఫైనల్ షెడ్యూల్ సమయంలో పెట్టారు. ఈ టైటిల్‌ను నాకోసం పెట్టమని ఫోర్స్ చేసినట్టుందని భావించి ముందు నేనేం మాట్లాడలేదు. కానీ ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ అనే క్యాప్షన్ చూడగానే టైటిల్ నాకు నచ్చింది. ప్రతి సినిమాను డిఫరెంట్‌గానే చేయాలని అనుకుంటాను. ‘నేను శైలజ’ చిత్రంలో నా నాటన చాలా బావుందని మెచ్చుకున్నారు. క్లాస్ ఆడియెన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే నా స్టయిల్ ఆఫ్ డ్యాన్స్, మూమెంట్స్, యాక్షన్‌ను కోరుకునే ప్రేక్షకుల కోసం చేసిన సినిమా ‘హైపర్’.
* ఇంతకీ కథేమిటి?
- ఇది అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమని పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చూడగానే అనిపించింది. ఈ సినిమాలో తండ్రి కొడుకులమధ్య అనుబంధంతోపాటు మంచి సోషల్ మెసేజ్ ఉంటుంది. ప్రతి సినిమాలో అమ్మాయికోసమో, నాన్నకోసమో, అమ్మ మాట కోసమో ఫైట్ చేస్తుంటారు. కానీ ఇందులో సోషల్ మెసేజ్ కోసం ఫైట్ చేస్తాను. నేను మెసేజ్ ఇస్తే, ఆ వయసు నాకు సరిపోతుందా, అందుకని ఇందులో సత్యరాజ్‌ను తీసుకున్నారు.

* సత్యరాజ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
- ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘నేను శైలజ’ వంటి సినిమాల్లో సత్యరాజ్‌గారి రోల్ చాలా సీరియస్‌గా వుంటుంది. దానికి భిన్నంగా ఇందులో ఆయన రోల్ కామిక్‌గా వుంటుంది. జనరల్‌గా అందరికీ అమ్మమీద ప్రేమ వుంటుంది. ఆ ప్రేమను వివిధ సందర్భాల్లో చూపిస్తూనే వుంటాం. అయితే నాన్నపై కూడా ప్రేమ వుంటుంది. కాని అది సందర్భానుసారం మాత్రమే బయటకు వస్తుంది. కానీ ఈ సినిమాలో హీరోకు నాన్నంటే ప్రేమ కాదు పిచ్చిప్రేమ ఉంటుంది. హీరో తన ప్రేమను అన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తుంటాడు. అది సినిమాలో ఆడియెన్స్‌కు కామెడిని పంచుతుంది.
* రియల్ లైఫ్‌లో మీ ఫాదర్‌తో ఎలా ఉంటారు?
- నిజ జీవితంలో నాన్నతో మీరందరూ ఎలా ఉంటారో నేను అలాగే ఉంటాను. నాన్నంటే భయపడను, భయం అనే కానె్సప్ట్ లేకుండా ఇంట్లో నన్ను పెంచారు.
* సోషల్ మెసేజ్ అంటున్నారు, ఇందులో ప్రేమకథ లేదా?
- ఇది లవ్‌స్టోరీ కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ కూడా వుంటుంది. దీంతోపాటు లవ్ అనే ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది.
* రాశీఖన్నాతో మరోసారి వర్క్ చేస్తున్నారు?
- ఈ కథకు ఆమె అయితేనే బెటర్ అని పెట్టాం. ఎందుకంటే, ఇప్పుడున్న హీరోయిన్స్‌లో రాశిఖన్నాకు కామెడీ టచ్ ఎక్కువగా ఉంది. సుప్రీమ్ సినిమాలో కూడా అది ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాతో తను రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. తనతో వర్క్ చేయడం చాలా సరదాగా వుంటుంది.
* సినిమాను చాలా త్వరగా పూర్తిచేసినట్టున్నారు?
- అవును.. ఇలాంటి సినిమాలు ఉంటే ఏదైనా తొందరగానే అవుతుంది. నిజానికి ఈ బ్యానర్ మొదటి సినిమా నేనే చేయాల్సింది కానీ అప్పుడు కుదరలేదు.
* దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ గురించి?
- ‘కందిరీగ’ తర్వాత నేను, వాసు కలిసి చేసిన సినిమా. తనలో కూడా చాలా హైపర్ ఉంది. కందిరీగ సమయంలో వాసుకి, హైపర్ సినిమాలోని వాసుకు చాలా తేడా ఉంది. తన మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. చాలా బాగా తీశాడు.
* ఈ పదేళ్ళ కెరీర్‌ని చూసుకుంటే ఎలా ఉంది?
- నేను పరిశ్రమకు వచ్చి పదేళ్లవుతోంది. సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌తో కలిసి చాలా ఎత్తుపల్లాలను చూసేశాను కాబట్టి ఓ సెటిల్డ్ స్థితికి చేరుకున్నాను. టెన్షన్ పడితే ప్రతి విషయానికి టెన్షన్ పడొచ్చు, పడకూడదనుకుంటే కూల్‌గా ఉండొచ్చు. అయితే ప్రతి సినిమా రిలీజ్ టైంలో కొంచెం టెన్షన్ మాత్రం ఉంటుంది.
* బ్లైండ్ పాత్ర చేస్తున్నట్లు తెలిసింది, నిజమేనా?
- ఇప్పుడు దాని గురించి చెప్పలేను, త్వరలోనే వివరాలు తెలియజేస్తా.
* తర్వాతి ప్రాజెక్ట్స్ ఏమిటి?
- కిషోర్ తిరుమలతో మరో సినిమా చేయాలని ఉంది. మరో ప్రాజెక్టు కూడా ఉంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రకటిస్తా.

-శ్రీ