నలుగురి కథ...మాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవికాగోర్, ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్ ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘మాంజా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ట్రైలర్ ఆవిష్కరించి ‘తొమ్మిది సంవత్సరాలకే ఈ చిత్ర దర్శకుడు దర్శకత్వం చేశాడంటే, అతన్ని ఆశీర్వదించడానికి తాను వచ్చానని, నలుగురు కుర్రాళ్ళ కథనంతో రూపొందించిన మాంజాలో గాలిపటాలకు ఎగరేసే మాంజా ఈ సినిమాలో మూలకథగా ఉపయోగించారని తెలిపారు. మంచి ఇతివృత్తాన్ని తీసుకుని అద్భుతంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన మాంజా చిత్రాన్ని 1న విడుదల చేస్తున్నామని, ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు రూపొందించిన విధానం అందరికీ నచ్చుతుందని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. హేమమాలిని తనయ ఇషా డియోల్ పాత్ర సినిమాకు హైలెట్‌గా వుంటుందని, ముగ్గురు కుర్రాళ్ళు, ఓ అమ్మాయి పోలీసులకు దొరికితే వాళ్ళని ఎలా ట్రీట్ చేశారనే కథనంతోపాటుగా వారు ఎలా తప్పించుకున్నారు, మాంజా వారికి ఎలా ఉపయోగపడింది అన్నదే ఈ చిత్ర కథాంశమని దర్శకుడు కిషన్.ఎస్.ఎస్. తెలిపారు.