డిసెంబర్‌లో కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని మరో వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ‘అఖిల్’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో ఆ సినిమా తరువాత ఇంతవరకూ తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టలేదు అఖిల్. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపినా కూడా ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయినట్టు నాగార్జున తెలిపారు. ఈమధ్యే వివాహం చేసుకుని కాస్త గ్యాప్ తీసుకున్న విక్రం ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ ముగించి డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అఖిల్ సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో వున్నారు. సూర్యతో 24 చిత్రాన్ని తెరకెక్కించిన విక్రం కుమార్, కథలను డీల్ చేయడంలో విభిన్న శైలి ప్రదర్శిస్తాడు. మరి అఖిల్‌ను ఆయన ఏ కోణంలో చూపిస్తాడో చూడాలి!