మనీ.. హనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో శే్వతశ్రీ క్రియేషన్స్ పతాకంపై జనార్దన్ శివలంకి దర్శకత్వంలో జె.వాసుదేవనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, అందరూ కొత్తనటులతోనే రూపొందించిన ఈ చిత్రం వచ్చే నెల ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, రానున్న 15వ తేదీన ఆడియోను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఓ అందమైన కథనంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో డబ్బు చేసే పలు లీలలను ఈ చిత్రంలో చూపుతున్నామని, మనీ వుంటే జీవితంలో తియ్యనైన అనుభవాలు ఉంటాయని, అందుకే ఈ చిత్రానికి మనీ ఈజ్ హనీ అనే పేరును పెట్టామని తెలిపారు.