జయాపజయాలను పట్టించుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, రాశీఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన ‘హైపర్’ ఈరోజు విడుదలవుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాతో మంచి హిట్‌ను అందుకుంటానని అంటున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’ తరువాత రామ్‌తో చేస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ..
గ్యాప్ వచ్చింది
ఈ గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. ఇప్పటికే రెండు మూడు కథలు చర్చల దశలోకి వచ్చాయి. కానీ అవి కుదరలేదు. ముందు మనం అనుకున్న కథ హీరోకి, నిర్మాతలకి నచ్చితేనే అది వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా దర్శకుడికి హిట్ వుంటే ఒకలా, ఫ్లాప్ అయితే మరోలా వుంటుంది పరిస్థితి. వాటన్నింటినీ తట్టుకుంటేనే ఇక్కడ నిలబడగలం.
రామ్‌కోసమే
ఈ కథ అనుకున్నపుడు రామ్ అయితేనే కరెక్ట్ అనిపించింది. తనకి కథ చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. రామ్ ఎనర్జికి, బాడీ లాంగ్వేజికి తగ్గట్టుగా వుండే సినిమా ఇది.

ఫాదర్ సెంటిమెంట్
తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఇలాంటి పాయింట్ మాత్రం రాలేదని చెప్పాలి. తండ్రిని పిచ్చిగా ప్రేమించే ఓ కొడుకు కథ ఇది. కొడుకు పిచ్చిప్రేమను భరించలేని తండ్రి పడే పాట్లు ఫన్నీగా కూడా వుంటాయి. దాంతోపాటు ఓ సోషల్ మెసేజ్ కూడా వుంటుంది.
హైపర్ అంటే?
సాధారణంగా ప్రతి ఇంట్లో ఒక హైపర్ వ్యక్తి వుంటాడు. ఇది అలాంటి కథే! తండ్రీ కొడుకులమధ్య జరిగే కథే అయినా, అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన సినిమా ఇది.
రామ్‌లో చాలా తేడా
కందిరీగ సినిమా సమయం నుండి రామ్‌తో చాలా మంచి స్నేహముంది. కందిరీగ రామ్‌కు హైపర్ రామ్‌కు చాలా తేడా వుంది. ముఖ్యంగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. రామ్ కమర్షియల్ సినిమా చేయగలడు, అలాగే నేను శైలజ లాంటి సినిమాలూ చేయగలడని నిరూపించాడు.
ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్
బేసికల్‌గా నాకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే ఇష్టం. ఎందుకంటే, ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాంటి ఎమోషన్స్ లేని మనిషి ఎవరూ వుండరని నా ఫీలింగ్. మీరు ఏ సూపర్‌హిట్ సినిమా తీసుకున్నా, ఈ అంశాలు ఖచ్చితంగా వుంటాయి. అందుకే అలాంటి సినిమాలు చేయాలనుంది.
హైలెట్స్
ఈ చిత్రంలో సత్యరాజ్ పాత్ర, రావు రమేష్ పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయి. అలాగే మణిశర్మ రీరికార్డింగ్, జీబ్రాన్ మ్యూజిక్ ఖచ్చితంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి.
రెండు షేడ్స్ వున్న పాత్ర
ఇందులో హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేయడానికి కారణం, తన పాత్ర రెండు షేడ్స్‌లో వుంటుంది. అలాంటి నటన రాశీ అయితే బాగా చేస్తుందని ఆమెను ఎంపిక చేశాం. అనుకున్నట్టుగానే అద్భుతంగా చేసింది. అలాగే, ఈ బ్యానర్‌లో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. ఒకరంగా ఇది హోం బ్యానర్ అని చెప్పాలి.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి కథలైతే రెడీగా వున్నాయి. ఈ సినిమా తరువాత తెలియజేస్తా.

చిత్రం..హైపర్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, హీరో రామ్

-శ్రీ