మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది రాశీఖన్నా. అందానికి అందం, అభినయం పుష్కలంగా వున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం రామ్ సరసన హైపర్ చిత్రంలో నటిస్తోన్న రాశీ, ఇటీవలే ‘సైతాన్ కా బచ్చా’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయకుండానే రాశీఖన్నాకు భారీ క్రేజ్ నెలకొంది. ‘సైతాన్ కా బచ్చా’ సినిమా షూటింగ్‌లో పాల్గొనకముందే ఈ భామకు మరో తమిళ క్రేజీ అవకాశం దక్కింది. అధర్వ హీరోగా నటించే ఈ చిత్రానికి డిమాంటీ కాలనీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఓకె అయింది రాశీఖన్నా. ఇప్పటికే గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’లోనూ, రవితేజ కొత్త సినిమాలోనూ నటిస్తోన్న ఈ భామకు మరిన్ని తమిళ అవకాశాలు ఎదురుచూస్తున్నాయట. మొత్తానికి రాశీ కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా వున్నట్టే!

చిత్రం.. రాశీఖన్నా