పెళ్లికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో పుట్టినా కూడా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో పెరిగి బాలీవుడ్‌లోకి క్వీన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ భామ లీసా హైడెన్. ఆ తరువాత హౌస్‌ఫుల్-3 సినిమాలో నటించి హాట్ హాట్‌గా రెచ్చగొట్టిన ఈమె, పలు మ్యాగజైన్లకు బికినీలంటూ హాట్‌గా ఫొటోషూట్‌లతో రెచ్చగొట్టింది. నటనకంటే కూడా గ్లామర్‌పైనే ఫోకస్ పెట్టిన ఈ భామ, ప్రస్తుతం పెళ్లికి సిద్ధమైందట. కొన్ని రోజులుగా ప్రముఖ వ్యాపారవేత్త గుల్లు లల్వాని తనయుడు డినో లల్వానితో ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి జోరుగా షికార్లు చేస్తున్నారు. వీరి వ్యవహారంపై బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈమె డినోతో వున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ త్వరలోనే పెళ్లిచేసుకుంటున్నామని తెలిపింది. ఫొటో పెడితే పెట్టిందిగానీ, ఇద్దరూ ఘాటుగా లిప్‌లాక్ చేసుకునే ఫొటో పెట్టి షాక్ ఇచ్చింది. అయితే, పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.

చిత్రం.. లీసా హైడెన్