క్వాంటికో-2 ప్రచారంలో ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘క్వాంటికొ’ 2 సీజన్ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బిజీగా ఉంది. ఈ సీరియల్‌లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది తొలి సిరీస్‌లో నటించి మెప్పించిన ప్రియాంక రెండో సీజన్‌లోనూ నటించింది. ప్రస్తుతం అమెరికాలో తోటి నటుడు బ్లెయిర్ అండర్‌వుడ్‌తో కలసి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాగా ఆమె ఈనెల 26న భారత్‌లో క్వాంటికో-2 ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. క్వాంటికోతో అమెరికన్ సినీ ప్రపంచానికి పరిచయమైన ప్రియాంక ‘బేవాచ్’ సినిమాలో నటిస్తూ హాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది.

చిత్రం..అమెరికాలో నిర్వహించిన గ్లోబల్ సిటిజన్ కార్యక్రమంలో క్యాట్‌వాక్ చేసిన ప్రియాంక చోప్రా