సుడిగాలిలో దెయ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ప్రధాన తారాగణంగా శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధర్ మల్లేష్ యాదవ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం సుడిగాలి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. దర్శకుడు సుడిగాలి చిత్ర కథను చక్కగా రాసుకున్నారని, కథకు తగిన విధంగానే టైటిల్‌ను ఖరారు చేశామని అన్నారు. ఆర్టిస్టులందరూ కొత్తవాళ్లైనా చక్కగా నటిస్తున్నారని, చిన్న సినిమాగా రూపొందిస్తున్నా పెద్ద అంచనాలు చిత్రంపై ఉన్నాయని తెలిపారు. సుడిగాలి అనే పదం వింటూ వుంటామని, ఆ గాలిని ఆధారం చేసుకుని దెయ్యాలు తిరుగుతూ వుంటాయని, పల్లెల్లో చెప్పుకుంటారని, అయితే సుడిగాలిలో దెయ్యాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపిస్తున్నామని దర్శకుడు రమేష్ అన్నారు. హారర్ కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం అలాంటి చిత్రాలు మెచ్చే ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని ఆయన అన్నారు. సుహాసిని, నరసింహవర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాప్‌రాక్ షకీల్, పాటలు: శ్రీనుసాగర్, ఎడిటింగ్: మేనగ శ్రీను, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ అంకం.