ఆస్కార్ ఎంట్రీకి విశారణై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ అవార్డు పొందిన తమిళ సినిమా ‘విశారణై’ను 2017 ఆస్కార్ అవార్డులకు (విదేశీ సినిమాల కేటగిరీలో) మన దేశం తరఫున పంపుతున్నారు. మొత్తం 29 సినిమాలను పరిశీలించి, చివరకు ‘విశారణై’ను ఆస్కార్ ఎంట్రీకి పంపాలని ఎంపిక చేసినట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ సుప్రన్ సేన్ గురువారం తెలిపారు. నటుడు ధనుష్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు వెట్రిమారన్ రచన, దర్శకత్వ బాధ్యతలు వహించారు. పోలీసుల కర్కశత్వం, అవినీతి, న్యాయం అందక అమాయకులు బలైపోవడం వంటి అంశాల చుట్టూ తిరిగే ‘విశారణై’లో దినేష్ రవి, ఆనంది, ఆదుకలాం మురుగదాస్ కీలకపాత్రల్లో నటించారు. గత ఏడాది జరిగిన 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు ఈ సినిమాకు దక్కాయి. 72వ వెనిస్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘విశారణై’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.