కమర్షియల్ కాష్మోరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకుల్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్స్ పతాకాలపై పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి, కెవిన్ అనె్న, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను, ఆడియోను వచ్చే నెల 7న విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసినవెంటనే మంచి రెస్పాన్స్ వచ్చిందని, కార్తీ డిఫరెంట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. కమర్షియల్ అంశాలతో వైవిధ్యంగా రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. ఈ సినిమాలో తన పాత్ర డిఫరెంట్‌గా వుంటుందని, ఈ సినిమా చూశాక తన కెరీర్‌లో ఓ మంచి చిత్రమని ప్రేక్షకులు ఒప్పుకుంటారని హీరో కార్తీ తెలిపారు. నయనతార, శ్రీదివ్య, వివేక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఓంప్రకాష్, సంగీతం:సంతోష్ నారాయణన్, ఎడిటింగ్:సాబూ జోసెఫ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోకుల్.